బన్ని ‘నా పేరు సూర్య’ లాంచ్ డేట్

Thursday,March 02,2017 - 11:47 by Z_CLU

దువ్వాడ జగన్నాథం సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది. కంప్లీట్ ఫోకస్ సినిమాపైనే పెట్టి ఏ మాత్రం డిలేస్ లేకుండా రెగ్యులర్ షూటింగ్ కి అటెండ్ అవుతున్న బన్ని, మరోవైపు తన నెక్స్ట్ సినిమా గ్రౌండ్ వర్క్ పై కూడా అప్పుడే కాన్సంట్రేట్ చేయడం  మొదలుపెట్టేశాడు. నిన్నా మొన్నటి దాకా ఇంకా  ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది అంటూ… న్యూస్ లో ఉన్న ఈ సినిమాకి సంబంధించి లాంచ్ డేట్ కూడా వినిపిస్తుంది.

వక్కంతం వంశీ బన్నితో ‘నా పేరు సూర్య’ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. బన్ని కూడా లాంగ్ లాంగ్ బ్యాక్ ఈ సినిమాకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. అయితే ఫాస్ట్ పేజ్ లో ఉన్న ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్ బన్ని బర్త్ డే, ఏప్రిల్ 8 న సినిమాని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నాడు.

ఇప్పటి వరకైతే ‘నా పేరు సూర్య’ విషయంలో ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, ఆల్ రెడీ DJ ఫీవర్ లో టాలీవుడ్ సరౌండింగ్స్… ఈ న్యూస్ తో ఇంకా హీటెక్కిపోతున్నాయి. మరి బన్ని మైండ్ లో ఏం నడుస్తుందో బర్త్ డే కల్లా తేలిపోతుంది.