వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన నా పేరు సూర్య

Friday,May 04,2018 - 10:01 by Z_CLU

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ గా ఓపెన్ అయింది. తొలిరోజు ఈ సినిమాకు కంప్లీట్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఓవర్సీస్ లో ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సూర్య పాత్రను, సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు.

తెలంగాణలో భారీ ఎత్తున నా పేరు సూర్య సినిమాను విడుదల చేశారు. బన్నీ కెరీర్ లోనే హయ్యస్ట్ నైజాం రిలీజ్ ఇది. సో.. ఈ ఏరియాలో కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు నమోదయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు వీకెండ్ మొత్తం టిక్కెట్లు ముందుగానే రిజర్వ్ అయిపోవడంతో.. రికార్డుల వేట షురూ అయినట్టే.

బన్నీ పెర్ఫార్మెన్స్.. వక్కంతం డైరక్షన్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. క్లయిమాక్స్ సినిమాలో మెయిన్ హైలెట్స్ అంటూ ఓవర్సీస్ నుంచి రిపోర్టులు వస్తున్నాయి. అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమయ్యాడు. రామలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీషాశ్రీధర్ ఈ సినిమాను నిర్మించారు.