ఒక రోజు ముందే రిలీజ్ కానున్న 'నా పేరు సూర్య'

Tuesday,February 13,2018 - 03:45 by Z_CLU

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ నా పేరు సూర్య. ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఒక రోజు ముందుకు జరిపారు. లెక్కప్రకారం ఏప్రిల్ 27న సినిమా థియేటర్లలోకి రావాలి. కానీ ఏప్రిల్ 26నే మూవీని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు మేకర్స్. ఈ మేరకు నా పేరు సూర్య సహనిర్మాత బన్నీ వాస్ ఫేస్ బుక్ పోస్ట్ పెట్టాడు.

బన్నీ కెరీర్ లోనే ఫుల్ లెంగ్త్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది నా పేరు సూర్య. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ అయింది. సెకండ్ సింగిల్ ను వాలంటైన్స్ డే గిఫ్ట్ గా రేపు రిలీజ్ చేయబోతున్నారు.

నా పేరు సూర్య సినిమాకు విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్నారు. రామలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీష్ శ్రీధర్ నిర్మిస్తున్నారు. నాగబాబు ఈ సినిమాను ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.