మెగా హీరో సినిమాకు మెగా ప్లానింగ్

Monday,January 22,2018 - 11:34 by Z_CLU

వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ బన్నీ చేస్తున్న సినిమా నా పేరు సూర్య. ఈ సినిమాకు సంబంధించి మెగా ప్లాన్ రెడీ చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం నా పేరు సూర్య సినిమాను ఏకంగా 7 భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సబ్జెక్ట్ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. దేశభక్తి కథాంశంతో తెరకెక్కుతోంది కాబట్టి, అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో 7 భాషల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠి, భోజ్ పురి భాషల్లో నా పేరు సూర్య సినిమాను తీసుకురాబోతున్నారట.

ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ ను రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు. రామలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.