మాసీ లుక్ లో అల్లు అర్జున్

Tuesday,October 08,2019 - 09:03 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో…’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘హారిక – హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అవటానికి ముస్తాబవుతోంది.

‘అల వైకుంఠపురంలో’ ని మొదటిపాట ‘సామజవరగమన’ ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయింది. దసరా పండగ సందర్భంగా విజయదశమి ఫెస్టివల్ సందర్భంగా యూనిట్ మరో పోస్టర్ రిలీజ్ చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ పోస్టర్ లో మాసీ లుక్ లో కనిపిస్తున్నాడు.

ఇటీవల విడుదల అయిన ‘సామజవరగమన’ పాటకు విడుదలైన వారంలోనే 20 మిలియన్ వ్యూస్, 5 లక్షల లైక్స్ వచ్చాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నటీనటులు:
అల్లు అర్జున్, పూజ హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సముద్రఖని, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ తదితరులు

సాంకేతిక నిపుణులు:
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్
సంగీతం: థమన్.ఎస్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)