మరికొన్ని గంటల్లో డీజే నుంచి మరో టీజర్

Monday,May 15,2017 - 10:57 by Z_CLU

ఇప్పటికే దువ్వాడ జగన్నాథమ్ ఫస్ట్ లుక్ టీజర్ తో హంగామా చేసిన బన్నీ మరికొన్ని గంటల్లో ఇంకో టీజర్ రిలీజ్ చేయబోతున్నాడు. డీజే సినిమాకు సంబంధించి ఆడియో రిలీజ్ టీజర్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుంది. నిర్మాత దిల్ రాజు అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో ఈ టీజర్ లాంచ్ అవుతుంది.

బన్నీ-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న డీజే సినిమాపై భారీ అంచనాలున్నాయి. సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. మరీ ముఖ్యంగా దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా కావడంతో ఈ ఎక్స్ పెక్టేషన్స్ ను ఇంకాస్త పెంచింది.

డీజేలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. జూన్ 23న దువ్వాడ జగన్నాథమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది.