#Shaakuntalam - అల్లు అర్జున్ కూతురు డెబ్యూ

Thursday,July 15,2021 - 02:25 by Z_CLU

సమంత కథానాయికగా గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ సినిమాతో అల్లు అర్జున్ కూతురు అల్లు ఆర్హ బాలనటిగా పరిచయమవుతుంది. తాజాగా ఆర్హ ‘శాకుంతలం’ సెట్స్ లో పాల్గొంది. ప్రస్తుతం ఆర్హ పై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో చైల్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు గుణశేఖర్. అల్లు ఆర్హ సినిమాలో ప్రిన్స్ భరత గా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Allu Arjun Daughter Allu Arha Tollywood debut with Shaakuntalam Movie 2

ఇక అల్లు ఫ్యామిలీ నుండి నాలుగో జెనరేషన్ నటిగా ఆర్హ ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ విషయాన్ని తెలియజేయడం గర్వంగా ఫీలవుతున్నాం అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ఆర్హ కి ఒక మంచి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు గుణ శేఖర్ , నీలిమ గుణ కి థాంక్స్ చెప్పాడు బన్నీ. సమంత శాకుంతల దేవిగా నటిస్తున్న ఈ మైథాలజికల్ లవ్ డ్రామా సినిమాలో దేవ్ మోహన్ హీరోగా కనిపించనున్నాడు.

allua arha ayan

దిల్ రాజు సమర్పణలో గుణ టీం వర్క్స్ బేనర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.మరి అల్లు రామలింగయ్య , అల్లు అరవింద్ , అల్లు అర్జున్ ఇలా మూడు జెనరేషన్స్ తర్వాత నాలుగో జెనరేషన్ నుండి నటిగా పరిచయమవుతున్న అల్లు ఆర్హ ‘శాకుంతలం’లో తన నటనతో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics