StylishStar నుండి రెండు సినిమాలు?

Friday,August 21,2020 - 01:08 by Z_CLU

గతేడాది సిల్వర్ స్క్రీన్ కి బ్రేక్ తీసుకున్న stylish star అల్లు అర్జున్ ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ తో ఫ్యాన్స్ ని ఖుషీ చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే అదే స్పీడుతో సుకుమార్ తో చేసే ‘PUSHPA’ ను కూడా ఈ ఏడాదే థియేటర్స్ లోకి తీసుకురావాలనుకున్నాడు బన్నీ. కానీ కరోనా కరోనా ప్రభావంతో సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేయాల్సిన పుష్ప’ షూటింగ్ వాయిదా పడింది.

ఈ ఏడాది రీచ్ అవ్వలేకపోయిన రెండు సినిమాల టార్గెట్ ను వచ్చే ఏడాది అందుకోవాలని భావిస్తున్నాడట స్టైలిష్ స్టార్.

పుష్ప షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టి వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడట Allu Arjun. పుష్ప షూట్ అవ్వగానే కొరటాల శివ సినిమాకు షిఫ్ట్ అయి వచ్చే ఏడాది లోపే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నాడట. అయితే బన్నీ ప్లాన్ బాగున్నా అది ఇంప్లిమెంట్ అవ్వడానికి , అనుకున్న టైంకి సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఇప్పుడున్న పరిస్థితులు చక్కబడాలి. అప్పటి వరకు అనుకున్నవి జరగడం కష్టం. చూడాలి మరి అల్లు అర్జున్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా ?