కొత్త సినిమా ప్రకటించిన బన్నీ

Saturday,April 08,2017 - 11:05 by Z_CLU

ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు బన్నీ. డీజే సినిమాకు సంబంధించి ఓ కొత్త స్టిల్ కూడా రిలీజ్ చేశాడు. పనిలో పనిగా మరో కొత్త సినిమాను ఎనౌన్స్ చేశాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడంటూ చాలా రోజులగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడా ప్రచారం నిజమైంది. బర్త్ డే సందర్భంగా వక్కంతంతో సినిమాను పక్కా చేశాడు అల్లు అర్జున్.

లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మాణంలో రామలక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 9గా ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదే సినిమాకు నాగబాబు సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారు. ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు మ్యూజిక్ డైరక్టర్స్ విశాల్-శేఖర్. బాలీవుడ్ లో స్టార్ కంపోజర్స్ గా వీళ్లకు పేరుంది. ఇప్పుడు వక్కంతం సినిమాకు వీళ్లే మ్యూజిక్ అందించబోతున్నారు.

వక్కంతం-బన్నీ సినిమాకు “నాపేరు సూర్య-నా ఇల్లు ఇండియా” అనే టైటిల్ అనుకుంటున్నారు. అయితే ఈ టైటిల్ ను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా క్లారిటీ  ఇవ్వలేదు. డీజే కంప్లీట్ అయిన తర్వాత వక్కంతం మూవీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి.