అల్లు అర్జున్ సినిమాకు టైటిల్ ఫిక్స్

Monday,July 29,2019 - 12:29 by Z_CLU

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా బన్నీ. అయితే మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఎట్టకేలకు టైటిల్ లాక్ చేశాడు త్రివిక్రమ్. తనదైన స్టయిల్ లో ఓ డిఫరెంట్ టైటిల్ పెట్టాడు. ఆ టైటిల్ లోగోను ఆగస్ట్ 15న విడుదల చేయాలని అనుకుంటున్నారు. త్వరలోనే దీనిపై ఓ అఫీషియల్ స్టేట్ మెంట్ రాబోతోంది.

సినిమాకు సంబంధించి ఇప్పటికే 2 భారీ షెడ్యూల్స్ పూర్తిచేశారు. ఆగస్ట్ మొదటి వారంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మరో షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు.

ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉంది. హీరోయిన్లుగా పూజా హెగ్డే, నివేత పెతురాజ్ నటిస్తుండగా.. రెండు కీలకమైన పాత్రల కోసం నవదీప్, సుశాంత్ లను తీసుకున్నారు. మరో కీలకమైన పాత్రలో టబు కనిపించనుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.