బన్నీ-త్రివిక్రమ్ మూవీ అప్ డేట్స్

Saturday,January 12,2019 - 11:30 by Z_CLU

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. మూవీకి సంబంధించి తాజాగా మరో అప్ డేట్ బయటకొచ్చింది. అంతా అనుకుంటున్నట్టు ఈ సినిమా ఈనెలలో సెట్స్ పైకి రావడం లేదు.

అవును.. బన్నీ-త్రివిక్రమ్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కు ఇంకాస్త టైమ్ పట్టేలా ఉంది. అందుకే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను మార్చి నుంచి స్టార్ట్ చేస్తారట. ఈ గ్యాప్ లో హీరోయిన్ ను ఫిక్స్ చేయడంతో పాటు, మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ డైరక్టర్, హీరోయిన్ ను ఫిక్స్ చేసే పనిలో అంతా బిజీగా ఉన్నారు.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత వీళ్లిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానీ పేరు గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు మ్యూజిక్ డైరక్టర్ గా దేవిశ్రీ పేరు కూడా వినిపిస్తోంది. త్వరలోనే ఈ రెండు ఎలిమెంట్స్ పై ఓ క్లారిటీ రానుంది.