Allu Arjun కి పాజిటివ్ - పుష్ప షూట్ బ్రేక్!

Wednesday,April 28,2021 - 02:17 by Z_CLU

కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ టాలీవుడ్ పై ఎకువగా ఉంది. వరుస పెట్టి హీరోలందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ముఖ్యంగా షూటింగ్స్ లో పాల్గొంటున్న సందర్భంలో ఎక్కువ మంది కరోన సోకి ఇబ్బంది పడుతున్నారు. ఇటివలే పవన్ కళ్యాణ్ , నివేత థామస్, పూజ హెగ్డే , సోనూ సూద్ ఇలా చాలా మందికి కోవిడ్ సోకి ఇబ్బంది పెట్టింది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డాడు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కరోన సోకింది. ఇటివలే బ్రేక్ లేకుండా పుష్ప షూట్ లో పాల్గొనడంతో బన్నీ పాజిటివ్ వచ్చింది. కొన్ని లక్షణాలు కనిపించడంతో వెంటనే టెస్ట్ చేయించుకున్నాడు బన్నీ. రిజల్ట్ లో కరోన పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు అల్లు అర్జున్. ఇటివలే తనను కలిసి వారు కూడా టెస్ట్ చేయించుకొని కేర్ తీసుకోవాలని సూచించాడు.

ప్రస్తుతం బన్నీ హోం క్వారెంటైన్ లో ఉంటున్నాడు. ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నాడు. వ్యాయామాలు చేస్తూ డాక్టర్ సూచించిన మెడిసిన్ తీసుకుంటూ కేర్ తీసుకుంటున్నాడు.

బన్నీ కి పాజిటివ్ రావడంతో పుష్ప షూట్ కి బ్రేక్ పడింది. మొన్నటివరకూ బ్రేక్ లేకుండా సన్నివేశాలు షూట్ చేశారు యూనిట్. హైదరాబాద్ పాటు వికారాబాద్ పరిసర ప్రాంతలో కూడా షూట్ చేశారు. ఇటివలే ఫాహాద్ ఫాసిల్ కూడా షూట్ లో పాల్గొన్నాడు. ఇక బన్నీతో కలిసి నటించిన యాక్టర్స్ , టెక్నీషియన్స్ కూడా ప్రస్తుతం టెస్ట్ చేయించుకొని హోం ఐసోలేషణ్ లో ఉన్నారని తెలుస్తుంది.

ఆగస్ట్ రిలీజ్ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప షూటింగ్ కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగిలి బ్రేక్ పడింది. బన్నీ పూర్తిగా రికవరీ అయ్యాక మళ్ళీ షూట్ మొదలు కానుంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics