గ్రాండ్ గా లాంఛ్ అయిన బన్నీ సినిమా

Wednesday,October 30,2019 - 12:37 by Z_CLU

అల వైకుంఠపురములో మూవీ సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా ప్రారంభించాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ కొత్త సినిమా స్టార్ట్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి.

ఓపెనింగ్ రోజునే సినిమాలో నటించనున్న హీరోయిన్ ను ప్రకటించింది యూనిట్. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా మెరవనుంది. ఇక తన ఆస్థాన సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ను ఈ సినిమాతో మరోసారి రిపీట్ చేస్తున్నాడు సుకుమార్.

దేవిశ్రీ, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 లాంటి మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. అలాగే బన్నీ-దేవిశ్రీ కాంబినేషన్ లో వచ్చిన బన్నీ, సన్నాఫ్ సత్యమూర్తి, డీజే సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. మరోసారి వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా…. మ్యూజిక్ లవర్స్ తో పాటు డాన్స్ లవర్స్ ను కూడా ఆకట్టుకోబోతోంది.

నటీనటులు :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (హీరో)
రష్మిక మందన్న (హీరోయిన్)

సాంకేతిక నిపుణులు :
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ (ప్రొడక్షన్ నెంబర్ 11)
సహ నిర్మాత – ముత్తంశెట్టి మీడియా
డైరెక్టర్: సుకుమార్
ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై
కెమెరామెన్: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్: ఎస్.రామకృష్ణ , మౌనిక
సి.ఈ. ఓ: చెర్రీ
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కె.వి.వి
పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను – మధు మడూరి