బన్నీ-సుక్కూ మూవీ టైటిల్.. అది రూమర్ మాత్రమే

Monday,January 20,2020 - 12:05 by Z_CLU

ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు సుకుమార్. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీకి శేషాచలం అనే టైటిల్ పెట్టినట్టు గాసిప్స్ వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదంటోంది యూనిట్. తమ సినిమాకు శేషాచలం అనే టైటిల్ పెట్టలేదని క్లారిటీ ఇచ్చింది. కనీసం అది వర్కింగ్ టైటిల్ కూడా కాదంటోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి బన్నీ ఇంకా సెట్స్ పైకి రాలేదు. వచ్చే నెలలో బన్నీతో కొత్త షెడ్యూల్ ప్రారంభమౌతుంది. ఆ తర్వాత సినిమా టైటిల్ పై ఓ డెసిషన్ తీసుకుంటారు. అప్పుడు అఫీషియల్ గా ప్రకటిస్తారు. బన్నీకి ఇది కెరీర్ లో 20వ సినిమా కాగా.. బన్నీ-సుక్కూ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కాబోతోంది.

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కు చెందిన కథతో ఈ సినిమా వస్తోంది. అందుకే ఈ మూవీకి శేషాచలం అనే టైటిల్ పెట్టినట్టు గాసిప్స్ వచ్చాయి. ఈ సినిమాలో కంప్లీట్ రఫ్ లుక్ లో కనిపించబోతున్నాడు అల్లు అర్జున్. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మూవీకి సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. రష్మిక హీరోయిన్.