తమిళ స్టార్ డైరక్టర్ తో బన్నీ చర్చలు?

Saturday,August 31,2019 - 04:38 by Z_CLU

ఒక్కసారిగా స్పీడ్ పెంచాడు అల్లు అర్జున్. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురం సినిమా చేస్తున్నాడు. ఆ వెంటనే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఆ వెంటనే సుకుమార్ సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఇలా ఒకేసారి 3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ బన్నీ మాత్రం రెస్ట్ తీసుకోవడం లేదు. ఇప్పుడు మరో ప్రాజెక్టు కోసం చర్చలు జరుపుతున్నాడు. ఈసారి ఏకంగా తమిళ స్టార్ డైరక్టర్ మురుగదాస్ నే లైన్లో పెట్టాడు.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే బన్నీ-మురుగదాస్ త్వరలోనే స్టోరీ డిస్కషన్లు స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మేరకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అంటే, మురుగదాస్ మూవీతో బన్నీ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నమాట. ఇన్నాళ్లూ డబ్బింగ్ మూవీస్ తోనే తమిళనాట హల్ చల్ చేసిన స్టయిలిష్ స్టార్, ఇప్పుడు తమిళ్ లో స్ట్రయిట్ మూవీ చేయబోతున్నాడన్నమాట.

గతంలో మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా చేశాడు మహేష్. మహేష్ కు తమిళ్ లో స్ట్రయిట్ మూవీ ఇదే. ఇప్పుడు బన్నీ కూడా మహేష్ బాటలోనే నడుస్తూ, మురుగదాస్ ను దర్శకుడిగా సెలక్ట్ చేసుకున్నాడు.