వైరల్ అవుతున్న అల్లు అర్జున్ వీడియో

Friday,February 08,2019 - 06:10 by Z_CLU

సినిమాలతో ఎంత బిజీగా ఉన్న దొరికిన కాస్త సమయాన్ని కూడా ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాడు బన్ని. ఆ స్వీట్ మూమెంట్స్ ని అప్పుడపుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటాడు. గతంలో అల్లు అయాన్ తో అల్లరి చేసే వీడియోని షేర్ చేసి, సోషల్ మీడియా కాన్సంట్రేషన్ మొత్తాన్ని గ్రాబ్ చేసిన బన్ని, ఇప్పుడు అల్లు అర్హా తో చేసిన అల్లరిని షేర్ చేసుకున్నాడు.

అల్లు అర్జున్ ‘అర్హా’ ని, పెద్దయ్యాక నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్ళి చేసుకుంటా అని చెప్పించే ప్రయత్నం, దానికి అర్హా, దానికి అర్థం తెలీకపోయినా ‘చేసుకోను’ అంటూ ముద్దుగా మారం చేయడం, దానికి బన్ని ‘దొంగ ఫెలో’ అంటూ  గారాలు పోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

https://twitter.com/alluarjun/status/1093808407448932352

ఈ వీడియోకి రిప్లై గా అల్లు శిరీష్ ఇప్పటి నుండే కూతురిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ‘దేసీ ఫాదర్’ అని ట్వీట్ చేయడంతో,  ఈ ట్వీట్ చుట్టూ మరింత బజ్ క్రియేట్ అవుతుంది.