సోషల్ మీడియాలో స్టైలిష్ కింగ్

Thursday,December 15,2016 - 03:30 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాను రూల్ చేస్తున్నాడు. రీసెంట్ గా చేసిన రీసర్చ్ లో అల్లు అర్జున్ సౌత్ ఇండియన్ సినిమా స్టార్స్ అందరిలోను ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా నమోదయ్యాడు.

2016 లో రిలీజయిన ‘సరైనోడు’ సినిమా కేరళలో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో మొత్తం సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ గూగుల్ లో కూడా ఎక్కువగా సర్చ్ అయ్యే స్టార్స్ లిస్టులో చేరిపోయాడు.

ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దువ్వాడ జగన్నాథంలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.