బన్నీ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పిన మొదటి వ్యక్తి

Monday,January 27,2020 - 07:28 by Z_CLU

అల వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. నాన్-బాహుబలి రికార్డులు సృష్టించింది. ఇది ఈ రేంజ్ హిట్ అవుతుందని మేకర్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేయలేదు. కానీ ఒకరు మాత్రం ఇది రికార్డులు క్రియేట్ చేస్తుందని ఊహించారు. ఆ ఒకే ఒక్కడు మెగాస్టార్ చిరంజీవి.

అవును.. సినిమాను జస్ట్ ప్రివ్యూ థియేటర్ లో ఒక్కరే చూసి బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారు చిరంజీవి. ఈ విషయాన్ని స్వయంగా బన్నీ బయటపెట్టాడు.

“సినిమా హిట్టవుతుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి కేవలం ప్రివ్యూ థియేటర్ లో చూసి చెప్పేశారు. సినిమా చూసి బయటకొచ్చి వెంటనే అల వైకుంఠపురములో స్థాయి చాలా పెద్దదని అప్పుడే అన్నారు.. మేమంతా అప్పుడు షాక్ అయ్యాం. నామీద ఇష్టంతో అలా మాట్లాడుతున్నారేమో అని అన్నాను. లేదు, నాకు తెలుస్తోంది, సినిమా పెద్ద హిట్ అన్నారు చిరంజీవి. మెగాస్టార్ ఎక్స్ పీరియన్స్ అది.”

ఇక ఈ సినిమాకు బన్నీ రెమ్యూనరేషన్ పై కూడా చిన్నపాటి డిస్కషన్ జరిగింది. మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా అల్లు అరవింద్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అందరు హీరోలకు ఇచ్చినట్టుగానే, రిలీజ్ కు వారం రోజుల ముందే బన్నీకి రెమ్యూనరేషన్ ఇచ్చేశానని అన్నారు అల్లు అరవింద్.

“మేం తండ్రికొడుకులం. చాలా క్లోజ్ గా ఉంటాం. కానీ ప్రొఫెషన్ దగ్గరకు వచ్చేసరికి చాలా టైట్ గా ఉంటాను. రిలీజ్ కు వారం రోజుల ముందే హీరోల రెమ్యూనరేషన్ ను వాళ్ల ఇంటికి పంపించేస్తుంటాను. ఇది నా అలవాటు. బన్నీ విషయంలో కూడా ఈ అలవాటు తప్పలేదు. మనలో మనకేంటి డాడీ అన్నాడు. అయినా నేను ఒప్పుకోలేదు. ప్రొఫెషన్ లో ఇలానే ఉండాలి.”