‘నా పేరు సూర్య’ లో హీరో అల్టిమేట్ గోల్ – అల్లు అర్జున్

Monday,April 23,2018 - 12:04 by Z_CLU

నిన్న మిలిటరీ మాధవరంలో ‘నా పేరు సూర్య’ ఆడియో లాంచ్ గ్రాండ్ గా జరుపుకుంది సినిమా యూనిట్. అయితే ఈ కార్యక్రమంలో స్టైలిష్ స్టార్ బన్ని స్పీచ్ హైలెట్ గా నిలిచింది. సినిమా గురించి… సినిమాలో తన క్యారెక్టర్ గురించి బన్ని చెప్పిన విషయాలు…

ఈ సినిమా చేయడం వల్ల మిలిటరీ మాధవరం అనే గ్రామం గురించి తెలుసుకునే అవకాశం దొరికిందని చెప్పుకున్న బన్ని, ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ దగ్గరి నుండి ప్రొడ్యూసర్స్ వరకు ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పుకున్నాడు. మిలిటరీ ఆఫీసర్స్ అంటే తనకు చాలా రెస్పెక్ట్ అని చెప్పుకున్న బన్ని, ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెప్పుకున్నాడు.

‘’నాకు మిలిటరీ వాళ్ళంటే చాలా అభిమానం. గౌరవం. అలాంటి క్యారెక్టర్ ని ఈ సినిమాలో ప్లే చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా ఫీలవుతున్నాను. ఈ సినిమాలో హీరో గోల్ ఒక్కటే… అది సైనికుడై దేశానికి సేవ చేయాలి. అది తప్ప వేరే ఆలోచన లేని యువకుడు.. సూర్య”. అని చెప్పుకున్నాడు అల్లు అర్జున్.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మే 4 న గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ నెల 29 న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుపుకోనుంది నా పేరు సూర్య టీమ్. విశాల్ – శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటించింది.