మరో సాంగ్ తో రెడీ అవ్తున్న 'నా పేరు సూర్య'

Sunday,January 28,2018 - 09:50 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ఇటివలే రిలీజై అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఈ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ హంగామా చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమాలోని మరో సాంగ్ ను వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదల చేయబోతునట్లు ప్రకటించారు మేకర్స్. ‘లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో’ అంటూ సాగే లవ్ సాంగ్ ని వాలెంటైన్స్ డే స్పెషల్ గా సోషల్ మీడియా రిలీజ్ చేయబోతున్నారు.

విశాల్ -శేకర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి సింగిల్ కార్డ్ లిరిక్స్ అందిస్తున్నారు. మరీ ఇప్పటికే సైనికా సాంగ్ తో సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ హల్చల్ చేస్తున్న ‘నా పేరు సూర్య’ ఈ సెకండ్ సింగల్ సాంగ్ తో ఏ రేంజ్ హంగామా చేస్తుందో..చూడాలి.

రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీదర్ , బన్నీ వాస్ , నాగబాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన అను ఇమ్మనుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 27 న సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది.