Pushpa Updates : షూట్ ఎప్పుడంటే?

Monday,August 10,2020 - 02:07 by Z_CLU

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న ‘Pushpa Movie’ షూట్ మొదలు కాబోతుంది. లాక్ డౌన్ వల్ల  షూటింగ్ వాయిదా పడిన ఈ భారీ బడ్జెట్ సినిమా అక్టోబర్ నుండి సెట్స్ పైకి వస్తుందని టాక్. ఇప్పటికే షూటింగ్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చకచకా జరుగుతోంది. సుక్కు తన టీంతో ఇప్పటికే భారీ షెడ్యుల్ కి సంబంధించి ఓ ప్లానింగ్ రెడీ చేసి ఎవరి భాద్యతలు వారికి అప్పగించాడు.

టైటిల్ అనౌన్స్ మెంట్ కంటే ముందే ఓ వారం పాటు బన్నీ లేకుండా తక్కువ మంది ఆర్టిస్టులతో కేరళలో షూట్ చేశారు. అక్టోబర్ నుండి జరగబోయే షెడ్యుల్ లో Allu Arjun ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హైదరాబాద్ తో పాటు తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లిలో బన్నీ మిగతా క్యాస్టింగ్ పై కొన్ని మెయిన్ సీన్స్ షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ సరసన Rashmika హీరోయిన్ గా నటించనుంది.