Allu Arjun Pushpa - షూటింగ్ అప్ డేట్స్!

Tuesday,September 07,2021 - 04:15 by Z_CLU

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటింగ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి సమీపంలో మారేడుమిల్లి లో శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం బన్నీ, రష్మిక లపై దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన డ్యుయట్ సాంగ్ షూట్ చేస్తున్నారు యూనిట్. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ ని కంపోజ్ చేస్తున్నాడు. ఈ సాంగ్ పూర్తి చేసి అక్కడే కొన్ని కీలక సన్నివేశాలు కూడా తీయనున్నాడు సుకుమార్. బన్నీ-ఫహాద్ ఫాసిల్ లపై కొన్ని సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తుంది.

ఇక హైదరాబాద్ లో తీయబోయే ఐటెం సాంగ్ తో టోటల్ షూటింగ్ ప్యాకప్ చెప్పబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఒక టాప్ హీరోయిన్ ని ఫైనల్ చేసి లాక్ చేసుకున్నారు. మరి బన్నీ సరసన ఐటెం గర్ల్ గా కనిపించే ఆ హీరోయిన్ ఎవరనేది మరికొన్ని రోజుల్లో బయటికి రానుంది. అక్టోబర్ మొదటి వారంతో షూటింగ్ గుమ్మడి కాయ కొట్టేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టనున్నారని సమాచారం.

మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్ , సునీల్ , అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ ‘అల వైకుంఠపురం’ తర్వాత బన్నీ నుండి వస్తున్న ఈ ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా సినిమాను థియేటర్స్ లోకి తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. అప్పటికల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసి డేట్ ఎనౌన్స్ చేస్తారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics