Allu Arjun Pushpa - సెట్స్ పైకొచ్చిన బన్నీ

Tuesday,July 06,2021 - 11:51 by Z_CLU

లాంగ్ గ్యాప్ తర్వాత పుష్ప మూవీ మళ్లీ సెట్స్ పైకొచ్చింది. ఈరోజు ఉదయం ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. హీరో అల్లు అర్జున్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. దాదాపు 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందంట.

బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో పార్ట్-1కు సంబంధించిన షూటింగ్ ఓ కొలిక్కి వచ్చింది. ఈరోజు స్టార్ట్ అయిన షెడ్యూల్ లో, పార్ట్-1కు సంబంధించి టోటల్ షూట్ పూర్తిచేయబోతున్నారు.

pushpa movie stills allu arjun

ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత పుష్ప సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు అటు రష్మిక కాల్షీట్ల ఎడ్జెస్ట్ మెంట్ కూడా ఈ ప్రాజెక్టుకు కష్టంగా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ లో 2 సినిమాలు, కోలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్న ఈ బ్యూటీ.. ఎంత త్వరగా కాల్షీట్లు ఇస్తే అంత త్వరగా పుష్ప షూట్ పూర్తవుతుంది.

మలయాళ స్టార్ యాక్టర్ ఫహాజ్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతడికిదే తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ ఐటెంసాంగ్ ఉంది. ఆ పాటలో బన్నీతో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ డాన్స్ చేయబోతోంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics