Allu Arjun - Pushpa : మళ్లీ ఆగిన బన్నీ మూవీ
Thursday,December 03,2020 - 04:19 by Z_CLU
Allu Arjun Pushpa Movie Shooting cancelled
Allu Arjun–Sukumar కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటింగ్ మూవీగా తెరకెక్కుతున్న Pushpa సినిమా షూటింగ్ కి మరోసారి బ్రేక్ పడింది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటివలే ఈస్ట్ గోదావరి జిల్లా మారేడుమిల్లిలో ప్రారంభం అయింది. అల్లు అర్జున్ తో పాటు మిగతా నటీనటులపై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. దీంతో పాటు రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ ఎపిసోడ్ కూడా షూట్ చేశారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో అనుకున్న షెడ్యుల్ కి బ్రేక్ పడిందని తెలుస్తుంది.
Covid19 వ్యాప్తి కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేసినప్పటికీ తాజాగా షూట్ లో పది మందికి పైగా కరోనా సోకిందని సమాచారం. వెంటనే యూనిట్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ తిరిగి ప్రయాణమైందని తెలుస్తుంది.
అయితే అన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ యూనిట్ కి కరోనా ఎలా సోకిందనేది ప్రశార్థకంగా ఉందట. ప్రస్తుతం అనుకున్న షెడ్యూల్ కి బ్రేక్ పడటం పుష్ప షూట్ మళ్ళీ వాయిదా పడటం ఖాయమనిపిస్తుంది. Mythri movie makers బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని భావిస్తున్నారు.