Allu Arjun Pushpa - ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

Tuesday,August 03,2021 - 01:40 by Z_CLU

అల్లు అర్జున్ – సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్ ఈ కాంబోలో వచ్చిన రెండు సినిమాల ఆల్బమ్స్ ఇప్పటికీ ఎక్కడో చోట వినబడుతూనే ఉంటాయి. మరి ఈ క్రేజీ కాంబోలో రాబోయే మూడో ఆల్బం అంటే అటు ప్రేక్షకుల్లో ఇటు అభిమానుల్లో బోలెడన్ని అంచనాలు ఉంటాయి. ఇప్పుడు ‘పుష్ప’ సాంగ్స్ పై అలాంటి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుండి రాబోయే ఫస్ట్ సింగిల్ గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మ్యూజిక్ లవర్స్.

తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి అలాగే సాంగ్ ఎలా ఉండబోతుందో కూడా హింట్ ఇచ్చేశారు మేకర్స్. అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమాను ఆగస్ట్ 13 న థియేటర్స్ లోకి తీసుకురావాలని భావించారు మేకర్స్. కానీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో రిలీజ్ వాయిదా వేసుకున్నారు. అందుకే అదే డేట్ కి ఇప్పుడు అభిమానుల కోసం ఫస్ట్ సింగిల్ వదులుతున్నారు.

ఐదు భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న పుష్ప ఫస్ట్ సింగిల్ ని ఐదుగురు సింగర్స్ తో పాడించాడు దేవి. తెలుగులో శివం , హిందీలో విశాల్ దద్లాని, తమిళ్ లో బెన్నీ దయాళ్ , కన్నడలో విజయ్ ప్రకాష్ , మలయాళంలో రాహుల్ నంబియార్ ఈ పాటను పాడారు. దేవి ఎనర్జిటిక్ ట్యూన్ కి మాస్ ని మెప్పించేలా అదిరిపోయే లిరిక్స్ అందించాడట చంద్రబోస్.

pushpa allua rjun

‘దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పీక’ అంటూ మొదలయ్యే ఈ సాంగ్ ఎనౌన్స్ మెంట్ నుండే ఇటు ఫ్యాన్స్ ని అటు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంది. మరి మరో పది రోజుల్లో విడుదలయ్యే ఈ సాంగ్ ఎన్ని వ్యూస్ కొల్లగొడుతుందో, ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics