వారాహి బ్యానర్ లో సినిమా చేస్తా

Monday,July 16,2018 - 01:30 by Z_CLU

“ఒక పక్క పెద్ద సినిమాలు చేస్తూనే…మరో పక్క చిన్న సినిమాలు చేస్తున్న సాయి కొర్రపాటి గారికి కంగ్రాట్స్. ప్రతి సారి కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ..మంచి కంటెంట్ తో మూవీస్ తీస్తున్నారాయన. అందుకే ఆయనంటే నాకు చాలా రెస్పెక్ట్. మంచి కంటెంట్ తో వస్తే ఎప్పటికైనా వారాహి చలన చిత్రంలో సినిమా చేస్తాను”

స్టయిలిష్ స్టార్ బన్నీ ఇలా ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. కాంబినేషన్లు, బ్యానర్లు, సినిమాల అగ్రిమెంట్లు.. ఇలా అన్నీ తెరవెనక సీక్రెట్ గా జరుగుతున్న ఈ రోజుల్లో, కేవలం సాయికొర్రపాటిపై గౌరవంతో ఇలా పబ్లిక్ గా సినిమా చేస్తానని ప్రకటించాడు బన్నీ.

అల్లు అర్జున్ మాటిస్తే ఎప్పటికైనా దాన్ని నెరవేర్చుకుంటాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా పేరు సూర్య సినిమా. గతంలో ఎప్పుడో ఓసారి లగడపాటి శ్రీధర్ కు మాటిచ్చాడు. అలా వీళ్లిద్దరి కాంబోలో నా పేరు సూర్య వచ్చింది. ఇప్పుడు సాయి కొర్రపాటికి మాటిచ్చాడు బన్నీ.

విజేత సినిమాను ప్రత్యేకంగా చూసిన బన్నీ, ఆ సినిమా సక్సెస్ మీట్ కు వచ్చాడు. మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ పెర్ఫార్మెన్స్ ను మెచ్చుకుంటూనే, సాయి కొర్రపాటికి ఇలా ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు.