పూర్తిగా పుష్పగా మారిన బన్నీ

Thursday,August 20,2020 - 04:12 by Z_CLU

పుష్ప మూవీ కోసం బన్నీ మేకోవర్ అవుతున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ వచ్చినా, బయట బన్నీ ఎలా ఉంటాడనే క్యూరియాసిటీ మాత్రం చాలామందిలో ఉంది. ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీర్చేశాడు Allu Arjun.

Pushpa మూవీ కోసం పెంచిన జుట్టు, గడ్డంతో కెమెరాకు పోజులిచ్చాడు స్టయిలిష్ స్టార్. చూడ్డానికి సింపుల్ గా అనిపిస్తున్నప్పటికీ ఈ లుక్ లో చాలా స్టయిల్ ఉంది. అదే బన్నీ గొప్పదనం. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హైదరాబాద్ లోని గీతాఆర్ట్స్ ఆఫీస్ కు వచ్చిన బన్నీ ఇలా కెమెరా కంటికి చిక్కాడు.

పుష్ప సినిమాకు సంబంధించి చాలా ప్లాన్స్ వేశాడు Sukumar. కానీ కరోనా/ లాక్ డౌన్ కారణంగా కొత్త షెడ్యూల్ ప్రారంభించలేకపోయాడు. సినిమా సెట్స్ పైకి వచ్చి, తన పోర్షన్ కంప్లీట్ అయ్యేంతవరకు బన్నీకి ఈ జుట్టు, గడ్డం బాధ తప్పదు.