నా పేరు సూర్య – ట్రైలర్ ఇంపాక్ట్

Saturday,April 28,2018 - 12:24 by Z_CLU

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కింది అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’. రేపు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకుంటున్న సినిమా యూనిట్, ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు రిలీజైన టీజర్, డైలాగ్ ఇంపాక్ట్ తో సినిమాలోని జస్ట్ యాక్షన్ ఎలిమెంట్స్ ని ఎలివేట్ చేసిన ఫిలిమ్ మేకర్స్, ఈ ట్రైలర్ లో సూర్య గా కనిపించనున్న అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ ని మరింత క్లియర్ గా ఎలివేట్ చేశారు.

లవర్ బాయ్ గా, యాక్షన్ హీరో గా అల్లు అర్జున్ ని చాలా షేడ్స్ లో చూసిన ఫ్యాన్స్ కి ‘నా పేరు సూర్య’ కంప్లీట్ గా డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వబోతుందని క్లారిటీ ఇస్తుంది 1:49 సెకన్ల ట్రైలర్. పెద్ద ఫ్యామిలీ, అందమైన లవ్ సూర్య లైఫ్ లోని సాఫ్ట్ సైడ్ అయితే మితిమీరిన కోపం, హద్దుల్లేని దేశభక్తి సూర్య లోని మరో యాంగిల్. ‘క్యారెక్టర్ వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే’ అని ఫీలయ్యే సూర్య, తనని తాను మార్చుకుంటాడా..? లేదా..? అంత అగ్రెసివ్ గా ఉండే ఒక మిలిటరీ ఆఫీసర్ తన దేశానికి ఏం చేయగలిగాడు..? అన్నదే సినిమాలోని పాయింట్.

సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్ ని, రొమాంటిక్ ఆంగిల్ ని దర్శకుడు ఎలా ప్రెజెంట్ చేసి ఉంటాడు అనే పాయింట్ ని సినిమా చూడకుండా డిస్కస్ చేయడం కష్టమే కానీ, ట్రైలర్ లో చూసినదాన్ని బట్టి సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం మూవీ లవర్స్ పై భారీ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా  బన్ని కరియర్ బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

శరత్ కుమార్, యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమాలో నదియా అల్లు అర్జున్ కి తల్లిగా కనిపించనుంది. లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటించింది.