నా పేరు సూర్య థర్డ్ సాంగ్ - బ్యూటిఫుల్ లవ్

Tuesday,April 10,2018 - 05:59 by Z_CLU

రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా డైలాగ్ ఇంపాక్ట్ రిలీజ్ చేసింది నా పేరు సూర్య టీమ్. ఇప్పుడు ‘బ్యూటిఫుల్ లవ్’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉంది. సీతారామ శాస్త్రి రాసిన ఈ సాంగ్ ఏప్రిల్ 13 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

ఇప్పటికే రిలీజైన  2  సాంగ్స్ సోషల్ మీడియాలో గ్రాండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు అదే స్పీడ్ లో ఈ సినిమా థర్డ్ సాంగ్ ని రిలీజ్ చేయనున్న ఫిల్మ్ మేకర్స్, సినిమాలోని రొమాంటిక్ ఆంగిల్ ని ఎలివేట్ చేయనున్నారు. మే 4 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా త్వరలో సెలెబ్రేట్ ఆలోచనలో ఉంది నా పేరు సూర్య టీమ్.

 

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ హైలెట్ కానున్నాయి.  విశాల్ – శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి లగడపాటి శ్రీధర్ ప్రొడ్యూసర్. నాగబాబు ఈ సినిమాని నాగబాబు సమర్పిస్తున్నాడు.