సీక్రెట్ రివీల్ చేయనున్న ‘నా పేరు సూర్య’ టీమ్

Saturday,December 23,2017 - 04:06 by Z_CLU

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అల్లు అర్జున్ మిలిటరీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అయితే ఈ రోజు రాత్రి 10:30 కి ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రివీల చేయనున్నట్టు  అనౌన్స్ చేసింది సినిమా యూనిట్.

‘నా పేరు సూర్య’ టీమ్ రివీల్ చేయనున్న ఆ సీక్రెట్  ఏంటో క్లూ ఇవ్వలేదు కానీ, బన్ని ఫ్యాన్స్ మాత్రం అప్పుడే సోషల్ మీడియాలో డిస్కషన్స్ బిగిన్ చేసేశారు. సినిమా లాంచ్ చేసినప్పుడే ఈ మూవీ టైటిల్ లోగోని రిలీజ్ చేసిన ఈ మూవీ టీమ్, ఈ రోజు రాత్రికి రివీల్ చేయనున్న ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కోసం సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.  

ఏప్రియల్ 27, 2018 ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాని లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. విశాల్ & శేఖర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్స్.