1.5 మిలియన్స్ కి దగ్గరలో నా పేరు సూర్య సెకండ్ సింగిల్

Thursday,February 15,2018 - 12:37 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవేటెడ్ మూవీ ‘నా పేరు సూర్య’.  అల్లు అర్జున్ ని మోస్ట్ అగ్రెసివ్ మిలిటరీ ఆఫీసర్ గా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఫ్యాన్స్ లో హై ఎండ్ డిమాండ్ క్రియేట్ అయింది. దానికి తోడు వ్యాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ మూవీ సెకండ్ సింగిల్, 1.5 మిలియన్స్ కి దగ్గరలో ఉంది. లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో అంటూ సాగే ఈ లిరిక్స్, వ్యాలెంటైన్ సీజన్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించుకుంది.

ఫస్ట్ ఇంపాక్ట్ రిలీజ్ అయిన దగ్గర్నించి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించి చిన్న అప్ డేట్ వచ్చినా, సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసుకుంటుంది. సైనిక సాంగ్  తరవాత రిలీజైన ఈ సెకండ్ సింగిల్ సినిమాలోని రొమాంటిక్ ఆంగిల్ ఎలివేట్ చేస్తుంది. రామ జోగయ్య శాస్త్రి ఈ పాటకి లిరిక్స్ రాశారు.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నాడు. విశాల్ – శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటించింది. ఏప్రియల్ 26 న సినిమా రిలీజవుతుంది.