అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఇస్తున్న ఇంట్రెస్టింగ్ గిఫ్ట్

Friday,April 06,2018 - 05:23 by Z_CLU

ఈ ఇయర్ అల్లు అర్జున్ బర్త్ డే మరింత స్పెషల్ కానుంది. ఏప్రిల్ 8 న బన్ని బర్త్ డే సందర్భంగా ‘నా పేరు సూర్య’ డైలాగ్ ఇంపాక్ట్ రిలీజవుతుంది. మరోవైపు ఫ్యాన్స్ బన్ని బర్త్ డే కి సంబంధించి అప్పుడే ప్రిపరేషన్స్ కూడా బిగిన్ చేసేశారు. ఈ సారి బన్ని పుట్టిన రోజును మరింత స్పెషల్ గా ట్రీట్ చేస్తున్న ఫ్యాన్స్ వైజాగ్ లోని RK బీచ్ లో ‘నా పేరు సూర్య’ ఇసుక శిల్పం నిర్మిస్తున్నారు.

రాష్ట్రపతి అవార్డు గ్రహీత మానస్ శేషు ఈ స్యాండ్ ఆర్ట్ వేస్తున్నారు. 5 ఫీట్ల ఎత్తులో 30 ఫీట్ల వెడల్పులో నిర్మిస్తున్న ఈ స్యాండ్ ఆర్ట్ ని బన్నికి బర్త్ డే గిఫ్ట్ గా ప్రెజెంట్ చేయనున్నారు ఫ్యాన్స్. ఈ ఆర్ట్ కి సంబంధించి మరిన్ని డీటేల్స్ రేపు అనౌన్స్ చేయనున్నారు ‘నా పేరు సూర్య’ ఫిల్మ్ మేకర్స్.

మే 4 న గ్రాండ్ గా రిలీజవుతుంది ‘నా పేరు సూర్య’. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్ని లుక్స్ దగ్గరి నుండి అగ్రెసివ్ ఆటిట్యూడ్ వరకు ప్రతీది ఎట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటికే రిలీజైన 2 సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. త్వరలో రిలీజ్ కానున్న డైలాగ్ ఇంపాక్ట్ ఫ్యాన్స్ ని మరింతలా మెస్మరైజ్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.