అల్లు అర్జున్ - నా పేరు సూర్య రిలీజ్ డేట్

Wednesday,August 02,2017 - 04:53 by Z_CLU

అల్లు అర్జున్ నా పేరు  సూర్య- నా ఇల్లు ఇండియా ఈ రోజే సెట్స్ పైకి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్, ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసేసింది. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని  ఏప్రిల్ 27 న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది సినిమా యూనిట్.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటిస్తుంది. విశాల్ శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాని నాగబాబు సమర్పిస్తున్నాడు.