'నా పేరు సూర్య' ప్రొడ్యూసర్ లగడపాటి ఇంటర్వ్యూ

Tuesday,April 24,2018 - 07:48 by Z_CLU

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ మే 4 న గ్రాండ్ గా రిలీజవుతుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా సాంగ్స్, ప్రోమోస్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అవి మీ కోసం…

ఇది నాకు బన్ని ఇచ్చిన గిఫ్ట్…

గతంలో అప్పుడెప్పుడో బన్ని మీరు మా బ్యానర్ లో సినిమా చేస్తే బావుంటుందని చెప్పా.. ఆ మాట ఆయన మైండ్ లో పెట్టుకుని, ఆయన ఇంత సక్సెస్ మోడ్ లో ఉన్నప్పుడు, నన్ను పిలిచి ‘ఈ సినిమా మీ బ్యానర్ లో చేద్దామ’ని చెప్పడం… నిజంగా గ్రేట్. అమ్మైనా అడగనిదే అన్నం పెట్టదు.. అలాంటిది బన్ని ఆయనతో సినిమా చేయాలనే నా కోరికను మైండ్ లో పెట్టుకుని నా కలని నిజం చేశారు…

 

 

బెంచ్ మార్క్ మూవీ అవుతుంది…

‘సైనిక’ సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ తో సినిమా ఫ్యూచర్ తెలిసిపోయింది. సాంగ్ ఎంతలా రీచ్ అయిందో సినిమా కూడా అదే రేంజ్ లో మెస్మరైజ్ చేస్తుంది. డెఫ్ఫినేట్ గా ఇది బెంచ్ మార్క్ మూవీ అవుతుంది.

అందుకే బన్ని మేకోవర్…

ఈ సినిమాలో బన్ని చేసిన క్యారెక్టర్ అలాంటిది. మిలిటరీ ఆఫీసర్ కాబట్టి కంపల్సరీగా ఫిట్ నెస్ ఉండాలి, ఇక హెయిర్ స్టైల్ విషయానికి వస్తే క్యారెక్టర్ కి సూట్ అవ్వాలి దాంతో పాటు ట్రెండీగా కూడా ఉండాలి. బన్ని ఈ లుక్స్ లో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఈ గెటప్ తనకు చాలా బాగా సూట్ అయింది.

మిలిటరీ నేపథ్యం…

మిలిటరీ బ్యాక్ డ్రాప్…. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే నేపథ్యం. దేశంలో కొన్ని ఏరియాల్లో మాత్రమే దీన్ని రిలేట్ చేసుకుంటారు లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు…

ఆ ఫీలింగ్ కలుగుతుంది…

ఈ సినిమా చూశాక సైన్యంలో చేరి దేశానికి సేవ చేసుకుంటే ఇంత సంతృప్తి కలుగుతుందా అనే విషయాన్ని గ్రహిస్తారు. అద్భుతంగా ఉంటుంది సినిమా…

అదే సినిమా థీమ్…

దేశం మనకేమిచ్చింది అనేది కాకుండా మనం దేశానికి ఏమిచ్చాం అనేదే ఈ సినిమా మెయిన్ థీమ్… దేశానికి సేవ చేయాలనేదే ఈ సినిమాలో హీరో కథ…

అది క్యారెక్టరైజేషన్…

ఈ సినిమాలో హీరోకి చాలా కోపం. ఎంత కోపం అంటే ఆర్డర్స్ లేకుండానే కోపం తట్టుకోలేక షూట్ చేసేస్తాడు. అది మిలిటరీ డిసిప్లిన్ కి కంప్లీట్ గా వ్యతిరేకం. కానీ అలాంటి వాడి కోపం కూడా  ఒకానొక సందర్భంలో దేశాన్ని కాపాడుతుంది అనేదే సినిమా…

అందుకే విశాల్- శేఖర్…

ఎప్పుడైతే ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీ అని గ్రహించామో, దీనికి నేషనల్ ప్లాట్ ఫామ్ ఇవ్వాలని అనుకున్నాం. విశాల్ శేఖర్ గతంలో ‘టైగర్ జిందా హై’, ‘సుల్తాన్’ లాంటి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్స్ కి పని చేశారు. అందుకే వాళ్ళను ఫిక్స్ చేసుకోవడం జరిగింది.

లవర్ ఆల్సో – ఫైటర్ ఆల్సో సాంగ్…

D.O.P. రాజీవ్ రవి గారు రాలేకపోవడంతో హాలీవుడ్ D.O.P తో తెరకెక్కించాం. రేపు మీరు లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో సాంగ్ చూస్తే, హాలీవుడ్ మ్యూజిక్ వీడియో చూసినట్టు ఉంటుంది.

నా ఇన్వాల్వ్ మెంట్ ఉండదు…

నేను ఈ సినిమాలో అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు. కంప్లీట్ గా వక్కంతం వంశీ విజన్ ఈ సినిమా…

కొరియోగ్రఫీ హైలెట్…

బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ కొరియోగ్రఫీ సినిమాకి మెయిన్ హైలెట్. ఒక ఇంటర్నేషనల్  కొరియోగ్రాఫర్ కూడా ఈ సినిమాకు పనిచేశారు. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన ‘ఇరగ ఇరగ’ సాంగ్ ఇరగదీసేశాడు.

మరో హైలెట్…

‘సైనిక’ లో మాంటేజ్ సాంగ్స్.. రియల్ లొకేషన్స్ కి వెళ్లి షూట్ చేశాం. ఆర్మీ, నేవీ ఇలా డిఫెరెంట్ ప్లేసెస్ కి వెళ్లి రియల్ షాట్స్ ని షూట్ చేశాం.

అనూ ఇమ్మాన్యువెల్…

అనూ ఇమ్మాన్యువెల్ జస్ట్ తన సినిమా కరియర్ కోసం అమెరికా నుండి ఇండియాకి వచ్చింది. ఇంత తక్కువ టైమ్ లో ఇన్ని మంచి సినిమాలు చేయగలిగిందంటే తన కమిట్ మెంటే దానికి రీజన్. ఈ సినిమాలో తను ఒక బొమ్మలా ఉంది. రొమాంటిక్ సీన్స్ లో చాలా సెన్సిబుల్ గా చేసింది.

బాలీవుడ్ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్…

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ రావడం చాలా గర్వంగా ఉంది. ఈ ఈవెంట్ ని బాలీవుడ్ స్థాయిలో చాలా గ్రాండ్ గా చేయబోతున్నాం…

చిరంజీవి గారు సెట్స్ కి వచ్చారు…

చిరంజీవి గారిని ఆడియో లాంచ్ ఈవెంట్ కి రమ్మని రిక్వెస్ట్ చేశాం. కానీ ఆయన ఆ టైమ్ లో అమెరికాలో ఉండాల్సి రావడంతో, బన్నిని ఆశీర్వదించడానికే ఆ రోజు సెట్స్ కి వచ్చారు.

అందుకే బన్ని వాసు…

అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోని హ్యాండిల్ చేయగలనో లేదో నాకు అనుమానం ఉండేది. అల్లు అర్జున్ కి ఏ ఇబ్బంది  కలగకూడదు, అందునా బన్ని వాసు అల్లు అర్జున్ కి చాలా సన్నిహితుడు. అందుకే నేను బన్ని వాసును ఆడ్ చేసుకోవడం జరిగింది.

నెక్స్ట్ సినిమాలు

‘గోలీసోడా’ అనే తమిళ సినిమాని తెలుగులో ‘ఎవడు తక్కువ కాదు’ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నాం. చేతిలో 2 స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఎవడి గోల వాడిదే 2, స్టైల్ 2 సరైన కాస్టింగ్, డైరెక్టర్ దొరికితే సెట్స్ పైకి తీసుకు వస్తా…