మరికొన్ని గంటల్లో నా పేరు సూర్య ఫస్ట్ సింగిల్....

Thursday,January 25,2018 - 04:57 by Z_CLU

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ ఫస్ట్ ఇంపాక్ట్ తరవాత రిలీజవుతున్న ఫస్ట్ సింగిల్ ‘సైనిక…’ మరికొన్ని గంటల్లో రిలీజవుతుంది. ఏప్రియల్ 27 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం సినిమాలో హై ఇంపాక్ట్ క్రియేట్ చేసే యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది.

సినిమా సెట్స్ పై ఉండగానే ఎట్రాక్టివ్ మోడ్ లో ప్రమోషన్స్ చేస్తున్న సినిమా యూనిట్, రిపబ్లిక్ డే రోజు, సోల్జర్స్ కి ట్రిబ్యూట్ గా కంపోజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ లిరికల్ వీడియో మరికొన్ని గంటల్లో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయనుంది.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ ని లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. విశాల్ – శేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.