రిపబ్లిక్ డే రోజు ‘నా పేరు సూర్య’ ఫస్ట్ సింగిల్

Friday,January 19,2018 - 12:39 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన ‘ నా పేరు సూర్య’ ఫస్ట్ ఇంపాక్ట్ టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బన్ని కరియర్ లోనే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రియల్ 27 ను రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకుంది. అయితే రోజు రోజుకు ఫ్యాన్స్ లో   క్రేజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని, రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న రిలీజ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్.

బన్నిని ఆంగ్రీ మిలిటరీ ఆఫీసర్ లా డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేయనున్న ఈ సినిమా, రిలీజ్ కి ముందే ఎట్రాక్ట్  చేస్తుంది. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్స్ విశాల్ & శేఖర్ కంపోజ్ చేస్తున్న సాంగ్స్ లోంచి జనవరి 26 న రిలీజవుతున్న ఫస్ట్ సింగిల్  ‘సైనిక…’,  దేశ సరిహద్దుల్లో  ఉంటూ  కాపలా కాస్తున్న సోల్జర్స్  కి సల్యూట్ గా రిలీజవుతుంది.

అల్లు అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యువెల్ నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు.  లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో వక్కంతం వంశీ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.