ఈ రోజే ‘నా పేరు సూర్య’ ఆడియో లాంచ్ ఈవెంట్

Sunday,April 22,2018 - 10:23 by Z_CLU

ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి  ‘నా  పేరు సూర్య’  హంగామా బిగిన్ కానుంది. మిలిటరీ మాధవరంలో ఈ  రోజు గ్రాండ్ గా  ఆడియో లాంచ్ ఈవెంట్  జరుపుకోనుంది సినిమా. తాడేపల్లి గూడెం నుండి 12 కి. మీ. దూరం లో ఉన్న ఈ గ్రామంలో జరగనున్న ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యువెల్ తో పాటు కంప్లీట్ ‘నా పేరు సూర్య’ టీమ్ అటెండ్ అవుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన 3 సాంగ్స్ సూపర్ హిట్టయ్యాయి.  అందుకే ఈ రోజు జరగనున్న ఈ ఆడియో లాంచ్ లో రిలీజ్ కానున్న తక్కిన సాంగ్స్ పైనే అందరి కాన్సంట్రేషన్ ఫిక్స్ అయి ఉంది. దాంతో పాటు ఈ ఈవెంట్ లో హైలెట్ కానున్న అల్లు అర్జున్ స్పీచ్ కోసం, ఫ్యాన్స్ లో అప్పుడే కౌంట్ డౌన్ బిగిన్ అయిపోయింది.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మే 4 న గ్రాండ్ గా రిలీజవుతుంది. లగడపాటి శ్రీధర్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిందీ  సినిమా.