అల్లు అర్జున్ సంక్రాంతి సినిమాలు

Friday,July 12,2019 - 11:23 by Z_CLU

ఫ్యాన్స్ కి బన్ని సినిమాపై క్లారిటీ వచ్చేసింది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగనుంది. అసలే ఈ కాంబినేషన్ అనగానే క్రియేట్ అయిన హై ఎక్స్ పెక్టేషన్స్… సినిమా సంక్రాంతికి రిలీజ్  అనగానే మరింత క్రేజ్ అందుకున్నాయి. అయితే సంక్రాంతికి సందడి చేయడం అల్లు అర్జున్ కి ఇదే ఫస్ట్ టైమ్ కాదు.. గతంలోనూ రిలీజైన కొన్ని సినిమాలున్నాయి.

 

దేశముదురు : అల్లు అర్జున్ ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్స్ లో కనిపించిన సినిమా ఇది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అల్లు అర్జున్ లోని మరో కోణాన్ని ప్రెజెంట్ చేసింది. ఈ సినిమాతోనే హీరోయిన్ హన్సిక తెలుగు సినిమాకి పరిచయం అయింది. సినిమా రిలీజయింది సంక్రాతికే.

దీంతో పాటు మెగా హీరోలిద్దరూ సిల్వర్ స్క్రీన్ పై సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ఎవడు’ కూడా రిలీజయింది సంక్రాంతికే.  ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ తెరక్కుతున్న సినిమాతో మరోసారి సంక్రాంతి పండగకి మరింత ఎంటర్ టైన్ మెంట్ ని జోడించబోతున్నాడు స్టైలిష్ స్టార్.