బన్నీ రాకతో మారిన ఓవర్సీస్ టాప్-10 చార్ట్

Tuesday,January 21,2020 - 11:01 by Z_CLU

అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అల వైకుంఠపురములో సినిమా. మరీ ముఖ్యంగా బన్నీ ఎప్పట్నుంచో కలలుగంటున్న ఓవర్సీస్ మార్కెట్లో అతడికి సుస్థిర స్థానం కట్టబెట్టింది. యూఎస్ లో ఇప్పటికే 3 మిలియన్ మార్క్ కు దగ్గరగా చేరుకున్న ఈ సినిమా, ఓవర్సీస్ ఆల్ టైమ్ టాప్-10 లిస్ట్ లో చోటు కొట్టేసింది.

విడుదలైన వారం రోజుల్లో 2.8 మిలియన్ డాలర్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, ఇప్పటికే గీతగోవిందం, మహానటి, సైరా సినిమాల్ని క్రాస్ చేసింది. మరికొన్ని గంటల్లో ఇది మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాను కూడా క్రాస్ చేయడం గ్యారెంటీ..

ఇక 3 మిలియన్ మార్క్ టచ్ చేస్తే… సాహో, భరత్ అనే నేను సినిమాల లైఫ్ టైమ్ వసూళ్లకు పోటీగా నిలుస్తుంది బన్నీ మూవీ. మొన్నటివరకు ఈ సినిమా ఫైనల్ రన్ లో 3 మిలియన్ కలెక్ట్ చేస్తుందని భావించారు. కానీ ఇప్పుడు 3.5 మిలియన్ వరకు వెళ్లే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

యూఎస్ ఆల్ టైమ్ టాప్ గ్రాసర్స్
1. బాహుబలి-2 – $ 20 మిలియన్
2. బాహుబలి-1 – $ 6.99 మిలియన్
3. రంగస్థలం – $ 3.51 మిలియన్
4. భరత్ అనే నేను – $ 3.41 మిలియన్
5. సాహో – $ 3.23 మిలియన్
6. శ్రీమంతుడు – $ 2.89 మిలియన్
7. అల వైకుంఠపురములో – $ 2.80 మిలియన్
8. సైరా – $ 2.6 మిలియన్
9. మహానటి – $ 2.54 మిలియన్
10. గీతగోవిందం – $ 2.46 మిలియన్