Allu Arjun ని కలిసిన వీరాభిమాని

Saturday,October 03,2020 - 01:55 by Z_CLU

Stylish Star Allu Arjun ని మీట్ అయ్యేందుకు స్వగ్రామం మాచర్ల నుండి కాలినడకన హైదరాబాద్ చేరుకున్న డై హార్డ్ ఫ్యాన్ నాగేశ్వరావు ని తాజాగా తన ఆఫీసులో కలిసి ముచ్చటించాడు అల్లు అర్జున్. తనను కలిసేందుకు నాగేశ్వరావు పాదయాత్ర మొదలు పెట్టాడని తెలియగానే టీంతో అతన్ని ఆపి తన దగ్గరికి తీసుకురమ్మని బన్నీ కోరాడు.

కానీ అతను బన్నీ టీంకి దొరకలేదు. చివరికి ఆరు రోజుల కాలినడక ప్రయాణం తర్వాత హైదరాబాద్ చేరుకున్న అతడు ఎట్టకేలకు తన అభిమాన హీరోను కలిసి సంబరపడ్డాడు.

రోజుకి 30-40 కిలోమీటర్లు నడిచానని తన అభిమాన నటుడికి వివరించాడు నాగేశ్వరావు. తనను కలవడానికి ఇలాంటి ప్రయత్నం చేసిన వీరాభిమానిను చూసి బన్నీ కళ్ళు చెమర్చాయి. ఇకపై తనను కలవడానికి ఆరోగ్యం పట్టించుకోకుండా ఇలాంటి పనులు చేయొద్దని బన్నీ అభిమానికి చెప్పాడు. వీలు చూసుకొని అభిమానులను మళ్ళీ కలుస్తానని తెలిపాడు.

చివరిగా అభిమానికి మొక్క తో పాటు తన బ్రాండ్ మాస్క్ లను అందజేశాడు అల్లు అర్జున్.