వచ్చే ఏడాది బన్నీ కోలీవుడ్ డెబ్యూ

Tuesday,August 01,2017 - 12:05 by Z_CLU

లింగుసామి దర్శకత్వంలో ఇప్పటికే ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు బన్నీ. ఆ సినిమా ప్రకటన కూడా అధికారికంగా జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల అనుకున్న టైమ్ కు సెట్స్ పైకి రాలేదు. సినిమా ఆగిపోయిందంటూ ఒక దశలో పుకార్లు కూడా వచ్చాయి. కానీ బన్నీతో చేయాల్సిన సినిమా ఆగిపోలేదంటున్నాడు దర్శకుడు లింగుసామి. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వస్తుందంటున్నాడు.

నిజానికి సరైనోడు సినిమా తర్వాత లింగుసామి మూవీనే తెరపైకి రావాలి. కానీ దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేశాడు బన్నీ. ఆ మూవీ తర్వాత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాపేరు సూర్య సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత లింగుసామి సినిమా సెట్స్ పైకి వస్తుంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని ప్రకటించిన దర్శకుడు, ప్రస్తుతం హీరోయిన్లను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు. సో.. బన్నీ కోలీవుడ్ ఎంట్రీ వచ్చే ఏడాది ఉంటుందన్నమాట.