అల్లు అర్జున్-కొరటాల కాంబినేషన్

Friday,July 31,2020 - 01:14 by Z_CLU

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. సూపర్ హిట్ సినిమాల దర్శకుడు కొరటాల శివ, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూవీ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా సినిమా రాబోతోంది.

సినిమా ఎనౌన్స్ మెంట్ సందర్భంగా ఆలోచన రేకెత్తించే మంచి కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. కొరటాల శివ సినిమాలన్నీ సందేశాత్మకంగా ఉంటాయి. ఎంత మెసేజ్ ఇస్తాడో, అదే స్థాయిలో హీరోయిజం కూడా ఉంటుంది. అందుకే ఇతడు హిట్ డైరక్టర్ అయ్యాడు.

ఇప్పుడు బన్నీ కోసం కూడా అలాంటి ఆలోచింపజేసే కథనే కొరటాల సెలక్ట్ చేసుకున్నాడనే విషయం ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే అర్థమౌతోంది.

ప్రస్తుతానికి సినిమాకు సంబంధించి ప్రకటన మాత్రమే వచ్చింది. హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్ ఎవరనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారు. 2022 ప్రారంభంలో ఈ సినిమా ఉంటుందని పోస్టర్ లో ప్రకటించారు. గీతాఆర్ట్స్-2 సహ-నిర్మాతగా వ్యవహరిస్తుంది.