బన్నీ లిస్టులోకి ఆ డైరెక్టర్ ఎలా?

Saturday,June 13,2020 - 11:53 by Z_CLU

ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో 20వ సినిమాగా ‘పుష్ప’ చేస్తున్న అల్లు అర్జున్ నెక్స్ట్ కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడనే గాసిప్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పటికే బన్నీ లిస్టులో వేణు శ్రీరామ్ తో పాటు మురుగదాస్ కూడా ఉన్నారు. నెక్ట్స్ మూవీకి వీరు కాకుండా కొరటాల  పేరు తెరపైకి రావడంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

అవును.. పక్కా మాస్ సినిమాలతో అభిమానులకి పూనకాలు తెప్పించే మాస్ డైరెక్టర్ తో మూవీ అంటే ఏ హీరో అభిమానులైనా హ్యాపీగా ఫీలవుతారు. బన్నీ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు అదే సంతోషంలో ఉన్నారు.

‘పుష్ప’ తర్వాత వేణు శ్రీరామ్ తో బన్నీ ‘ఐకాన్’ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాను పలుమార్లు ప్రకటించారు కూడా. మరి ఆ ప్రాజెక్ట్ కంటే ముందే బన్నీ-కొరటాల కాంబో తెరపైకొస్తే లెక్కలు మారిపోతాయి. మరి ఇందులో నిజమెంతో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.