అల్లు అర్జున్ గ్యాప్ తీసుకోవడానికి రీజన్

Saturday,March 16,2019 - 11:03 by Z_CLU

ఇంకో 2 నెలలు గడిస్తే సరిగ్గా సంవత్సరం. లాస్ట్ ఇయర్ మే లో రిలీజయింది అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమా. ఆ తరవాత త్రివిక్రమ్ సినిమాతో అని కన్ఫమ్ అయినా… స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయిందనే ఇన్ఫర్మేషన్ ఉన్నా… సినిమా మాత్రం ఇంకా సెట్స్ పైకి రాలేదు. పోనీ సెట్స్ విషయంలో ఏమైనా టైమ్ పడుతుందా..? అంటే క్వశ్చన్ మార్కే.. ఎందుకంటే త్రివిక్రమ్ భారీ భారీ కట్టడాల జోలికి  అస్సలు పోడు… అందుకే కొంచెం కాన్సంట్రేట్ చేసి ఆలోచిస్తే ఈ ఆలస్యం అల్లు అర్జున్ వల్లేనేమో అనిపిస్తుంది.

‘వరసగా సినిమాల ప్రొఫైల్స్ ఒకచోట పెట్టి చూస్తే… కనీసం టైటిల్ కూడా చూడకుండా అది ఏ సినిమానో చెప్పేయాల’నేది బన్ని ఫిలాసఫీ. దానిని ప్రతి సినిమాకి తూ.చ. తప్పక పాటిస్తాడు కూడా. అందుకే బన్ని ఫిల్మోగ్రఫీని గమనిస్తే ఒక్కో సినిమాది ఒక్కో లుక్… దగ్గరలో కూడా కంపారిజన్స్ ఉండవు. కాబట్టి అనుమానం లేదు…  త్రివిక్రమ్ తో సినిమా కోసం కూడా లుక్స్ విషయంలో కుస్తీ పడుతున్నాడన్నమాట ఈ స్టైలిష్ స్టార్.

ఏది ఏమైనా ఈ గ్యాప్ మాత్రం బన్ని ఫ్యాన్స్ లో సినిమా చుట్టూ మరింత క్యూరియాసిటీ రేజ్ అయ్యేలా చేస్తుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన, S/O సత్యమూర్తి, జులాయి సినిమాలు వేటికవే డిఫెరెంట్. కనీసం ఒక స్టైల్ కి దగ్గరలో ఏమైనా చేసి ఉన్నా, సినిమా ఇలాగే ఉంటుందేమోనని అంచనా వేసే అవకాశాలైనా ఉండేవి.

ఒకసారి సినిమా సెట్స్ పైకి వచ్చిందంటే బన్ని సినిమాకి ప్యాకప్ చెప్పేవరకు మళ్ళీ బ్రేక్ మోడ్ లోకి వెళ్ళడు. కానీ సినిమాకి సంబంధించి కొద్దో, గొప్పో ఇన్ఫర్మేషన్ బయటికి రావాలంటే సినిమా సెట్స్ పైకి రావాల్సిందే. అందుకే ఫ్యాన్స్ ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేసిందనే న్యూస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.