సుక్కూ డైరక్షన్ లో బన్నీ.. ఈసారి మరింత కొత్తగా!

Tuesday,March 05,2019 - 11:09 by Z_CLU

అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య సినిమాతోనే దర్శకుడిగా మారాడు సుకుమార్. ఆ సినిమా బన్నీని కమర్షియల్ గా హీరోని చేస్తే, సుకుమార్ ను విలక్షణ దర్శకుడిగా నిలబెట్టింది. ఆ మూవీ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో ఆర్య-2 సినిమా వచ్చింది. ఆ తర్వాత బన్నీ-సుక్కూ మళ్లీ కలవలేదు. ఇన్నాళ్లకు ఆ టైమ్ వచ్చింది.

దాదాపు 9 ఏళ్ల గ్యాప్ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో మూవీ ఫిక్స్ అయింది. ఆర్య సిరీస్ తర్వాత వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేయడం ఇదే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ సినిమా. ఈ బ్యానర్ లో బన్నీకి ఇదే ఫస్ట్ మూవీ.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు బన్నీ. హారిక-హాసిని, గీతాఆర్ట్స్ బ్యానర్లపై ఈనెలలోనే సెట్స్ పైకి రాబోతోంది ఆ మూవీ. ఆ సినిమా తర్వాత సుక్కూ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్తాడు బన్నీ. ఇలా వరుసగా ఒకేసారి 2 సినిమాలు ఎనౌన్స్ చేసి నా పేరు సూర్య తర్వాత వచ్చిన షార్ట్ గ్యాప్ ను భర్తీ చేశాడు బన్నీ.