గీతగోవిందం దర్శకుడితో బన్నీ మూవీ?

Tuesday,December 11,2018 - 12:53 by Z_CLU

గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు పరశురాం. మంచి కథ సెట్ అవ్వకపోవడంతో ఇన్నాళ్లూ గ్యాప్ తీసుకున్న పరశురాం, ఇప్పుడు మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో రెడీ అయ్యాడు. బన్నీ హీరోగా ఆ లవ్ స్టోరీని తెరకెక్కిస్తాడనే టాక్ ప్రస్తుతం ఫిలింనగర్ లో గట్టిగా వినిపిస్తోంది.

గీతగోవిందం తర్వాత తన నెక్ట్స్ మూవీని కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే చేయబోతున్నాడు పరశురాం. అన్నీ అనుకున్నట్టు జరిగితే తన నెక్ట్స్ ప్రాజెక్టును బన్నీ హీరోగా తెరకెక్కించబోతున్నాడు. నా పేరు సూర్య తర్వాత బన్నీ ఇప్పటివరకు తన నెక్ట్స్ ప్రాజెక్టును ఎనౌన్స్ చేయలేదు.

అల్లు అర్జున్ తో సినిమా పరశురాం చిరకాల కోరిక. తను రాసుకున్న ప్రతి కథను బన్నీకి వినిపిస్తుంటాడు ఈ దర్శకుడు. గీతగోవిందం స్టోరీని కూడా మొదట బన్నీకే వినిపించాడు. తాజాగా రాసుకున్న ఈ కొత్త కథను కూడా బన్నీకి వినిపిస్తాడు. కాకపోతే అల్లు అర్జున్ ఈ స్టోరీకి ఓకే చేస్తాడా చేయడా అనేది డౌట్.