మైకేల్ జాక్సన్ బయోపిక్ లో అల్లు అర్జున్?

Friday,July 28,2017 - 04:46 by Z_CLU

ఇంటర్నేషనల్ లెవెల్లో గ్రేట్ డాన్సర్ అంటే మైఖేల్ జాక్సన్. తను మైఖేల్ జాక్సన్ స్టెప్స్ ను అనుసరించేవాడినని స్వయంగా చిరంజీవి ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. గోలీమార్ సినిమాలో అయితే ఏకంగా మైఖేల్ జాక్సన్ గెటప్, స్టెప్స్, బీట్ ను ఫాలో అయిపోయారు చిరు. ఇప్పుడు టాలీవుడ్ బెస్ట్ డాన్సర్ ఎవరంటే బన్నీ పేరు చెబుతారు ఎవరైనా. మరి అల్లు అర్జున్, మైఖేల్ జాక్సన్ ను ఎక్కడైనా ఫాలో అయ్యాడా..?

మైఖేల్ జాక్సన్ ను ఫాలో అవ్వడం ఎందుకు ఏకంగా జాక్సన్ బయోపిక్ లో నటిస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా ఈ ఆలోచనే వచ్చినట్టుంది పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తికి. అందుకే ఓ ఇంట్రెస్టింగ్ స్టేట్ మెంట్ వదిలేశారు. తన యూనిక్ స్టైల్ తో, డ్యాన్స్ తో ఇంతమంది ఫ్యాన్స్ ని పోగేసుకున్న బన్ని తో అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు కలిసి మైకేల్ జాక్సన్ బయోపిక్ తీయాలని కోరారు నారాయణమూర్తి. తెలుగులో ఆ బయోపిక్ కు బన్నీ ఒక్కడే సమర్థుడని అన్నారాయన.

ఆర్.నారాయణమూర్తి చెప్పిన విషయం బన్నీ ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. స్టయిలిష్ స్టార్, జాక్సన్ బయోపిక్ లో నటిస్తే బాగుంటుందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెరలేచింది. అయితే ఈ ప్రాజెక్టు వర్కవుట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ.