స్టైల్ మార్చిన అల్లు అర్జున్

Friday,September 15,2017 - 12:09 by Z_CLU

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అయితే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, తన డైలాగ్ డెలివరీ దగ్గరి నుండి బాడీ లాంగ్వేజ్ వరకు సరికొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడట.

అల్లు అర్జున్ కరియర్ లో ఫుల్ స్పేస్ మిలిటరీ ఆఫీసర్ గా, కంప్లీట్ మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఉండబోయే సీన్స్ తో పాటు, హై ఎండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోయే యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాలో హైలెట్ కాబోతున్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఉండే సీన్స్ ని తెరకెక్కించే పనిలో ఉంది సినిమా యూనిట్.

అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. వక్కంతం వంశీ డైరెక్టర్. లగడపాటి శ్రీధర్ ప్రొడ్యూసర్. ఏప్రిల్ 27 న ఈ సినిమాని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయి ఉంది సినిమా యూనిట్.