Allu Arjun Pushpa - బన్నీ బంగారు రింగులు

Wednesday,December 08,2021 - 01:03 by Z_CLU

Allu Arjun gifts gold rings to crew members of Pushpa

ఇండస్ట్రీలో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం చాలా కామన్. ఎవరి రేంజ్ లో వాళ్లు ఖరీదైన బహుమతులు ఇచ్చుకుంటారు. ఇప్పుడు బన్నీ వంతు వచ్చింది. పుష్ప సినిమా యూనిట్ లో కొంతమందికి బంగారు రింగులు ప్రజెంట్ చేశాడు బన్నీ. దీనికి ఓ కారణం ఉంది.

పుష్ప సినిమాకు సంబంధించి తాజాగా ఐటెంసాంగ్ పిక్చరైజ్ చేశారు. అల్లు అర్జున్, సమంత ఈ సాంగ్ లో డాన్స్ చేశారు. ఈ పాట కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేశారు. రికార్డ్ టైమ్ లో ఆ సెట్ వేయడంతో పాటు, త్వరగా షూటింగ్ పూర్తవ్వడానికి ఆర్ట్ డిపార్ట్ మెంట్ ఎంతగానో కష్టపడింది.

వాళ్ల పనిని కళ్లారా చూసిన అల్లు అర్జున్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ లో కొంతమందితో పాటు, మరికొంతమంది మిగతా డిపార్ట్ మెంట్ వ్యక్తులకు గోల్డ్ రింగులు బహుమతిగా ఇచ్చాడు. ఊహించని విధంగా అల్లు అర్జున్ నుంచి గోల్డ్ రింగ్స్ అందుకున్న క్రూ సభ్యులు ఉబ్బితబ్బిబ్బయ్యారు.

వచ్చే వారం పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. సరిగ్గా రిలీజ్ కు కొన్ని రోజుల ముందు ఐటెంసాంగ్ షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ ప్రారంభమైంది. లిరికల్ వీడియోస్ తో పాటు రీసెంట్ గా ట్రయిలర్ కూడా రిలీజ్ చేశారు.

ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు బన్నీ. ఈ హీరో కెరీర్ లో మొట్టమొదటి పాన్-ఇండియా సినిమా ఇదే.