కాకినాడలో బన్నీ.. రచ్చ చేసిన ఫ్యాన్స్

Wednesday,July 31,2019 - 04:10 by Z_CLU

కొత్త సినిమా షూటింగ్ కోసం కాకినాడ వచ్చాడు బన్నీ. తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలుసుకున్న ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. 24 గంటల ముందు నుంచే సంబరాలు షురూ చేశారు. కాకినాడ టౌన్ మొత్తం వెల్ కమ్ బన్నీ పోస్టర్లతో నింపేశారు.

#StylishStar #AlluArjun Arrived at kakinada, Received a Grand Welcome By The Fans #AlluArjunArmyKakinada #alluarjunatkakinada #AAArmyWelcomesAlluArjun

Posted by Sai Rapphael on Wednesday, 31 July 2019

 

బన్నీ వచ్చిన వెంటనే ఫ్యాన్స్ అంతా అతడికి ఘనస్వాగతం పలికారు. దారి పొడుగునా పూలవర్షం కురిపించారు. ఈలలు, చప్పట్లు, డప్పులతో సందడి చేశారు. ఇంత అపూర్వ స్వాగతాన్ని బన్నీ కూడా ఎక్స్ పెక్ట్ చేసి ఉండడు.

https://www.facebook.com/anshif.ayancheri.96/videos/146530796543225/

త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి రేపట్నుంచి కాకినాడ పోర్టు ఏరియాలో కొత్త షెడ్యూల్ ప్రారంభమౌతుంది. బన్నీపై ఓ చిన్నపాటి యాక్షన్ ఎపిసోడ్ ఇక్కడ ప్లాన్ చేశారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రెడీ చేస్తున్నారు.